Weekend demolitions : హైదరాబాద్ ఉప్పల్ లో వీకెండ్ కూల్చివేతలు షురు!

by Y. Venkata Narasimha Reddy |

హైదరాబాద్ లో ఆక్రమ నిర్మాణాల కూల్చివేత(Demolition of encroached structures)లలో ఓ వైపు జీహెచ్ఎంసీ(GHMC), మరోవైపు హైడ్రా(Hydra), అధికారులు దూకుడుగా సాగుతున్నారు.

Weekend demolitions : హైదరాబాద్ ఉప్పల్ లో వీకెండ్ కూల్చివేతలు షురు!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ఆక్రమ నిర్మాణాల కూల్చివేత(Demolition of encroached structures)లలో ఓ వైపు జీహెచ్ఎంసీ(GHMC), మరోవైపు హైడ్రా(Hydra), అధికారులు దూకుడుగా సాగుతున్నారు. వీకెండ్ కూల్చివేతలపై హైకోర్టు తరుచు మొట్టికాయాలు వేస్తున్నప్పటికి అధికార యంత్రాంగం మాత్రం అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో వెనకడుగు లేకుండా ముందుకు దూసుకెలుతున్నారు. వీకెండ్ కూల్చివేతల పేరుతో ఆక్రమ నిర్మాణాలు తొలగించే క్రమంలో ఉప్పల్ లోని మండే మార్కెట్ ప్రధాన రహదారిపై ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు.

పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఇకముందు ఫుట్ పాత్ ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఉప్పల్ చిలుకానగర్, నల్ల చెరువు ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించారు. మరోవైపు హైడ్రా సైతం తాజాగా ఆక్రమణల తొలగింపు చర్యలలో భాగంగా అక్రమ హోర్డింగ్‌ లను సైతం కూల్చివేస్తుంది. కూకట్ పల్లి నిజాంపేట మెయిన్ రోడ్డులో.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. చాదర్‌ఘాట్‌ పరిధిలో జేసీబీతో కూల్చివేతలు నిర్వహించారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడాలోని ఆదివారం పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి.

హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీలు వీకెండ్‌లో కూల్చివేతలు చేపడుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. తాము కోర్టులను ఆశ్రయించే వీల్లేకుండా.. కావాలనే సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నారని అంటున్నారు. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన బాల్ రెడ్డి అనే వ్యక్తి వీకెండ్ హైడ్రా కూల్చివేతలపై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వీకెండ్ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని.. ఒక్క రోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యం అంటూ చీవాట్లు పెట్టింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్.. సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హైడ్రాకు హెచ్చరించింది.

Next Story