అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుంది:జిల్లా కలెక్టర్ కె. శశాంక

by Disha Web Desk 11 |
అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుంది:జిల్లా కలెక్టర్ కె. శశాంక
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ఆకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులు, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ శశాంక అభయమిచ్చారు.

ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో అకాల వర్షం, ఆకస్మికంగా కురవడంతో నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం మంజూరుకై సత్వరమే నివేదికలు అందించేందుకు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షపు నీటికి కొట్టుకుపోవడం, కోతకొచ్చిన మామిడి పంట నేలరాలిపోవడంతో రైతులకు అధికారులు అండగా నిలిచేందుకు నివేదికలు త్వరితగతిన రూపొందించి ఇవ్వాలన్నారు.

జిల్లాలో మరిపెడ, నెల్లికుదురు, నర్సింహులపేట, చిన గూడూరు మండలాలలో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు సమాచారం ఉందన్నారు. వ్యవసాయ సంబంధిత అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను సందర్శించి వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. పంటను కోల్పోయిన రైతుకు ధైర్యం చెప్పాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీఓ లు కొమరయ్య, రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed