ములుగులో ఘనంగా సురక్ష దివస్..

by Disha Web Desk 13 |
ములుగులో ఘనంగా సురక్ష దివస్..
X

దిశ, ములుగు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్ష దివస్ ర్యాలీని ములుగు జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిములుగులో ఘనంగా సురక్ష దివస్.. కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య హాజరు అయ్యారు. ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పోలీస్ శాఖ సాధించిన విజయాలను దృశ్యరూపంలో గల వీడియోను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రారంభం కాగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.


ములుగు పోలీస్ స్టేషన్ నందు ప్రారంభమైన ర్యాలీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు సాగింది. ములుగు జిల్లా పోలీస్ శాఖ పోలీస్ విధులు పట్ల ప్రజల అవగాహనకై కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా వాటర్ బోర్డు చైర్మన్ ప్రకాష్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి కలెక్టర్ భావేష్ మిశ్రా, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖలోని ఒక్కో వర్టికల్ కి ఒక స్టాల్ నిర్మించి పోలీస్ విధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.


మొత్తంగా 12 స్టాల్స్ నిర్వహించగా అందులో ఆయుధాల ప్రదర్శన, అల్లరి మూకల నుండి రక్షించుకునే రియట్ గేర్, నేర పరిశోధనలో కీలకమైన క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ ప్రాముఖ్యత, అత్యవసర సేవలు అందించే డయల్ 100, రాత్రి పగలు గస్తీ కాసే బ్లూ కోల్ట్స్, షీ టీమ్స్, ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, కమ్యూనికేషన్ విభాగం, మత్తు పదార్థాల యొక్క ప్రాముఖ్యత సైబర్ నేరాల పట్ల అవగాహన, డ్రోన్ కెమెరా ల ఉపయోగం పోలీస్ విభాగంలో అత్యంత కీలకమైన డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్, రోడ్డు భద్రత అవగాహన వరదల సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ఆహారం ఆవాసం అందించిన పోలీసుల వీరత్వం వంటి అంశాలపై ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి అశోక్ కుమార్, ఏఎస్పి ఏటూర్ నాగారం సిరి శెట్టి సంకీర్త్, అదనపు ఎస్పీ సదానందం, డిసిఆర్‌బి డిఎస్పి సుభాష్ బాబు, డిఎస్పి ములుగు రవీందర్, సీఐ లు, ఎస్సై లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed