పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలి : రిటర్నింగ్ అధికారి

by Disha Web Desk 23 |
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలి :  రిటర్నింగ్ అధికారి
X

దిశ,మేడ్చల్ బ్యూరో : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గౌతమ్ ప్రిసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం రోజున కీసర మండలంలోని బోగారంలోని హోలీ మేరీ కాలేజీలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్,ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటరు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ లను, ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. మే 8వ తేదీ వరకు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులందరూ వినియోగించుకొనుటకు ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా, సాఫీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో రజిని, హసీనా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కంటోన్మెంట్ లో..

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక తో పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ (కంటోన్మెంట్ నియోజకవర్గ) పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సక్రమంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్, నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డిలు ఆదేశించారు. శుక్రవారం బేగంపేటలోని వెస్లీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ , ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ , ఓటరు రిజిస్ట్రేషన్ లతోపాటు ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ నెల 8వ తేదీ వరకు జరిగే పోస్టల్ బ్యాలెట్ ను అర్హులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎన్నికల అధికారి మధుకర్ నాయక్, సహాయ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని , ఏఆర్వో దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed