బీజేపీ, బీఆర్ఎస్ ల పాలనలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేదు : శ్రీధర్ బాబు

by Disha Web Desk 20 |
బీజేపీ, బీఆర్ఎస్ ల పాలనలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేదు : శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కరువైందని మాజీ మంత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్యదర్శి కర్ణాటక ఎన్నికల ఇంచార్జి, ఎంఎల్ఏ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన సత్యాగ్రహ దీక్ష సమావేశంలో శ్రీధర్ బాబు ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో గ్రామాల్లో పట్టణాల్లో, జిల్లాకేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రహ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారని శ్రీధర్ బాబు అన్నారు. స్వాతంత్ర సమరయోధుల కలను నిజం చేసేందుకు సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని శ్రీధర్ బాబు కోరారు.

కాంగ్రెస్ పాలనలో ప్రధాన మంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి,ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు,మన్మోహన్ సింగ్ ల పాలనలో ప్రతిపక్షాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ పార్టీల పాత్రను సక్రమంగా పోషించేందుకు స్వేచ్ఛ కల్పించారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని పార్లమెంట్లో చూడద్దని అప్రజ స్వామికంగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు శ్రీధర్ బాబు విమర్శించారు. టిఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో దళితులకు ఏం న్యాయం జరిగిందో ప్రజలంతా ఆలోచించాలని, కేంద్రంలో రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతుందని శ్రీధర్ బాబు విమర్శించారు. అబ్బో ఏ కాలంలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ప్రతిచోట సత్యాగ్రహా దీక్షలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed