సీఎం సిద్ధరామయ్యకు అభినందనలు తెలిపిన శ్రీధర్ బాబు...

by Disha Web Desk 20 |
సీఎం సిద్ధరామయ్యకు అభినందనలు తెలిపిన శ్రీధర్ బాబు...
X

దిశ, కాటారం : కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో శనివారం కొలువుదిరిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ లను కళ్యాణ కర్ణాటక రీజియన్ ఇంచార్జ్, ఏఐసీసీ కార్యదర్శి మాజి మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికలలో ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఇంచార్జిగా శ్రీధర్ బాబు కీలక భూమిక పోషించారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ టికెట్లు పంపిణీ, ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని నెలలుగా శ్రీధర్ బాబు కర్ణాటక రాష్ట్రంలోనూ అభ్యర్థుల గెలుపులోను పదవులు రచిస్తూ అధిష్టానం ఆదేశాలను అమలుచేస్తూ ముఖ్యభూమిక పోషించారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పడే వరకు అక్కడే ఉండి కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను కలిసి అభినందించారు.

Also Read..

కర్ణాటక కొత్త సీఎంకు ప్రధాని మోడీ విషెస్



Next Story

Most Viewed