జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తొలగింపు..?

by Disha Web Desk 11 |
జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తొలగింపు..?
X

దిశ, హనుమకొండ టౌన్: అధిష్టానం పలుమార్లు హెచ్చరించిన, అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి, ఇచ్చిన షోకాజ్ నోటీసును కూడా విస్మరించినందున జంగా రాఘవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడం జరిగిందని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే జంగా రాఘవరెడ్డికి సహకరించినా వారిపై కూడా పార్టీ పరంగా చర్యలు తీసుకోబడుతాయని, ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల పేరిట, పాదయాత్ర పేరిట జంగా రాఘవ రెడ్డి పర్మిషన్ల కొరకు అప్లై చేసినా, కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం తేది 26 జులై 2021న జిల్లా అద్యక్షులైన (నాయిని రాజేందర్ రెడ్డి , జంగా రాఘవ రెడ్డి)లను సమావేశపరిచి వారితో మాట్లాడి, భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇటువంటివి జరగకుండా సూచనలు చేయడం జరిగింది. అయినప్పటికీ జంగా రాఘవ రెడ్డిలో మార్పు రాలేదు. తదనుగుణంగా తనపై తదుపరి చర్యలు చేపట్టడం జరిగింది అని అన్నారు. పై విషయమై హెచ్చరించినప్పటికి మార్పు రాకపోవడం వలన టీపీసీసీ క్రమశిక్షణ సంఘం జంగా రాఘవ రెడ్డికి తేది 02 మే 2022 రోజున షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.

జంగా రాఘవ రెడ్డికి గతంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన షోకాజ్ నోటీసును విస్మరించి, అధిష్టానం పలుమార్లు హెచ్చరించిన అవేమి పట్టించుకోకుండా హన్మకొండ జిల్లాలో తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, నాపై (నాయిని రాజేందర్ రెడ్డి) అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఐకమత్యానికి విఘాతం కలిగిస్తూ, పార్టీ పరువు తీస్తూ, ప్రత్యర్థ పార్టీలకు లాభం చేకూర్చేవిధంగా వ్యవహరిస్తూ, అధిష్టానం ఆదేశాలను ధిక్కరించినందుకు జంగా రాఘవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడం జరిగిందని చెప్పారు.



Next Story

Most Viewed