- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ కడియం కావ్య
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : మడికొండ మహిళా ప్రాంగణంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పెట్రోల్ బంక్‌కు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, అధికారులతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, మహిళల పేరుమీదే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే మహిళా సంఘాలకు అధిక మొత్తంలో వడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణంపై కొందరు విమర్శలు చేసినప్పటికీ, ప్రభుత్వం మహిళలను కేవలం ప్రయాణికులుగానే కాకుండా ఆర్టీసీ వ్యవస్థలో భాగస్వాములు, యజమానులుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోందని వివరించారు. మడికొండలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కావడం ఆనందదాయకమని, మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. మహిళలు విద్యావంతులు, ఆర్థికంగా స్వావలంబులు అయినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే నాగరాజు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి మహిళలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.






