ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే షాపులను సీజ్ చేస్తాం.. మున్సిపల్ కమిషనర్

by Dishafeatures2 |
ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే షాపులను సీజ్ చేస్తాం.. మున్సిపల్ కమిషనర్
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే షాపులను సీజ్ చేస్తామని మన్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి హెచ్చరించారు. మంగళవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపల్ అధికారులు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. పలు షాపుల్లో మున్సిపల్ అధికారులు సిబ్బంది దాడులు నిర్వహించి ఒక్కో షాపుకు రూ.1000 చొప్పున జరిమానా విధించారని చెప్పారు. నిత్యం ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపాలిటీ తరఫున దాడులు చేస్తామని తెలిపారు. దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దని కోరారు. ప్రజలు సైతం ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టి ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed