స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులకు అవమానం.. క్షమాపణ చెప్పిన మంత్రి..

by Disha Web Desk 14 |
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులకు అవమానం.. క్షమాపణ చెప్పిన మంత్రి..
X

దిశ, మహబూబాబాద్ : 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులను అవమానించారని సోమవారం జిల్లా జర్నలిస్ట్‌లు నిరసన తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకల్లో అన్ని శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు సీట్లు కేటాయించినప్పటికీ, మీడియా కవరేజ్‌కు వచ్చిన విలేకరుల‌కు ప్రత్యేక స్థానం కల్పించలేదు. దాంతో స్టేజి ఎదురుగా ఉన్న బురదలో కూర్చుని మీడియా కవరేజ్ చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు.

సుమారు గంట పాటు జర్నలిస్ట్‌లకు, అధికారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జర్నలిస్ట్‌లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జర్నలిస్ట్‌లు తమ నిరసనను కొనసాగించారు. అనంతరం ప్రసంగం ముగించుకొని వచ్చిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్ట్‌లకు క్షమాపణ చెప్పారు. జర్నలిస్ట్‌లను అవమానించడం సరి కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవీందర్, శ్రీనివాస్, శ్రీహరి, బిక్షం, చందు, వర్మ, శ్రీను, యశ్వంత్ , రాజు, ఉదయ్ ధీర్, సతీష్, ప్రభాకర్, సుబాని, అశోక్, కె.కె,ముఖేష్, వెంకటేశ్వర్లు, రమేష్, జీవన్, చారి పాల్గొన్నారు.Next Story