ప్రగతి పథంలో జనగామ జిల్లా: మంత్రి ఎర్రబెల్లి

by Dishaweb |
ప్రగతి పథంలో జనగామ జిల్లా: మంత్రి ఎర్రబెల్లి
X

దిశ,జనగామ: జనగామ జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీస్ గౌరవ వందన స్వీకరించిన అనంతరం,తెలంగాణ తల్లి విగ్రహానికి అదేవిధంగా అమరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ సాధించిన తర్వాత వివిధ రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని వివరించారు. ముఖ్యంగా అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలు తీరును, మంత్రి ఈ సందర్భంగా వివరించారు.

ఈ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో చేనేత, జౌళి శాఖ,విజయ డైరీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన ప్రారంభించారు. అరగంట పాటు సాగిన మంత్రి ప్రసంగం అనంతరం జనగాం గాంధీ బాలికల పాఠశాల,రఘునాథపల్లి, లింగాలగణపురం, సెయింట్ పాల్స్, మైత్రి కళాక్షేత్రం పేరిణి సంతోష్ కళాబృందాలచే నిర్వహించిన సాంస్కృత కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, జనగామ,స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,తాటికొండ రాజయ్య,జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,డిసిపి సీతారాం,అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్,మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, పలువురు కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

అన్ని సౌకర్యాలు కల్పించాలి: సీఎస్ శాంత కుమారి

రైతు దినోత్సవంపై అన్ని జిల్లాల కలెక్టర్లుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుబంధు రైతు బీమా వంటి పథకాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్,జనగామ, స్టేషన్గన్పూర్ ఆర్డీవోలు మధుమోహన్,కృష్ణవేణి, సిపిఓ ఇస్మాయిల్ జడ్పీ సీఈవో వసంత, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామిరెడ్డి, డీఈవో రాము,డిఐసి రమేష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.


Next Story

Most Viewed