పర్మిషన్ ఉందా? అన్న రైతు ప్రశ్నతో ఆగిన మట్టి తవ్వకాలు

by Ratna Kumari |

మండలంలోని కొప్పుల శివారులో చెరువు మట్టిని తవ్వి వసంతపూర్ గ్రామంలోని ఓ రైతు భూమికి తరలిస్తున్న ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.

పర్మిషన్ ఉందా? అన్న రైతు ప్రశ్నతో ఆగిన మట్టి తవ్వకాలు
X

దిశ, శాయంపేట : మండలంలోని కొప్పుల శివారులో చెరువు మట్టిని తవ్వి వసంతపూర్ గ్రామంలోని ఓ రైతు భూమికి తరలిస్తున్న ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం తెలుసుకున్న స్థానిక రైతు అక్కడికి వెళ్లి “మట్టి ఎందుకు తీస్తున్నారు? మీకు ఏమైనా పర్మిషన్ ఉందా?” అని నిలదీయడంతో జేసీబీ యంత్రాలు, ట్రాక్టర్లు తవ్వకాలను వెంటనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రైతు తీవ్ర ఆగ్రహంతో, “పెద్ద చెరువులో మట్టి తీయమని మీకు ఎవరు చెప్పారు? మట్టి తీసి ఇతరుల భూములను ఆక్రమించుకోవాలని ఎవరైనా చెప్పారా?” అంటూ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా చెరువుల నుంచి మట్టి తరలింపులు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు

Next Story