అబెర్యస్త్వత్ యూనివర్సిటీ & కేయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు..

by Disha Web Desk 20 |
అబెర్యస్త్వత్ యూనివర్సిటీ & కేయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు..
X

దిశ, కేయూ క్యాంపస్ : అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో అకాడమిక్ కార్యక్రమాలు, పరిశోధనల పై నిరంతర అధ్యయనానికి కేయూ వేదిక అని ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం, యునైటెడ్ కింగ్ డం , వేల్స్ లోని అబెర్యస్త్వత్ యూనివర్సిటీ సంయుక్త సహకారంతో జూన్ 27–29 మధ్య నిర్వహించబోతున్న అంతర్జాతీయ సదస్సు “ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జీనో ఎడిటింగ్” ప్లాంట్ బయో టేకెన్ గోడ పత్రికను సైన్సు విభాగాల డీన్ ఆచార్య మల్లారెడ్డి, విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య సదానందం, ఆచార్య రామస్వామి, ఆచార్య రాంరెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం విభాగ పరిశోధకులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాకతీయ విశ్వవిద్యాలయ విభాగాల పరిశోధనలును ప్రజలకు తెలియచేయాలని అన్నారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ జాతీయ సమావేశాలు కుడా నిర్వహిస్తామని తెలిపారు. పోటి ప్రపంచంలో విశ్వవిద్యాలయం తట్టుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాదిపతి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శాస్త్రి, డాక్టర్ ఎవీ రావు, డాక్టర్ రాధిక, డాక్టర్ మహేందర్, డాక్టర్ రజినీకాంత్, డాక్టర్ భారత్, డాక్టర్ ఫనికాంత్, విశ్రాంత ఆచార్యులు ఆచార్య కృష్ణమాచారి, ఆచార్య క్రిస్తోఫేర్, ఆచార్య కృష్ణారెడ్డి తదితరలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed