పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి: మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి

by Disha Web Desk 11 |
పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి: మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి
X

దిశ, జనగామ: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సాయం అందించి ఆదుకోవాలని టీపీసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కొమురవెళ్లి, చేర్యాల మండలాల పరిధి గురువన్నపేట, తపాసుపల్లి, ఐనాపూర్, పొసాన్ పల్లి, నాగపూరి, గండికుంట, పోతిరెడ్డిపల్లి, పెదరాజుపేట ప్రాంతాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంట చేతికందే సమయంలో రైతులు తీవ్ర నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాలను పిలిపించి ఎన్యూమరేషన్ చేయించి నష్టపోయిన రైతులకు ఎకరాకి రూ. 40 వేల ఆర్థిక సాయం ఇవ్వాలని కోరారు. కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలని అన్నారు. గతంలో నష్టపోయిన రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని, ఇప్పుడైనా తప్పనిసరిగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొమ్ము నరసింగరావు, కొయ్యడ శ్రీనివాస్, లింగంపల్లి కనకరాజు, వేలాద్రి అంజిరెడ్డి, మల్లం శేఖర్, మల్లం బాలయ్య, రాగుల శ్రీనివాసరెడ్డి, కాటం మల్లేశం, కాశెట్టి ఉపేందర్, జంబుల వెంకట్ రెడ్డి, జంగని రవి, తుప్పు నరసయ్య, మాజీ సర్పంచ్ కనకయ్య, మాజీ ఎంపీటీసీ కోటా వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.



Next Story