సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం : మంథని ఎమ్మెల్యే

by Dishaweb |
సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం : మంథని ఎమ్మెల్యే
X

దిశ, కాటారం : బీఆర్ ఎస్ శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల టికెట్ల కేటాయింపులో అగ్ర కులాలకే పెద్ద పీట వేయడం ద్వారా ఆ పార్టీలో సామాజిక న్యాయం కొరవడిందని, మహిళలకు మైనార్టీలకు ఇతర కులస్తులకు ప్రాతినిధ్యం లేదని,ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో తన గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రెండు చోట్ల నిలబడుతున్నారని గజ్వేల్ నియోజకవర్గం పక్కనే మరో నియోజకవర్గం దాటి ఇంకొక చోట పోటీ చేస్తున్నారన్నారు.

దూర ప్రాంత జిల్లాలో పోటీ అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించినట్లుగా ఉండేదని, ఏలాగైన ప్రభుత్వం రాదని ముందే తెలిసి పార్టీని నడిపించాలని ఉద్దేశంతో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యేలు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ టిక్కెట్లు ఇచ్చారని పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ప్రజలందరూ బేరిజు వేసుకోవాలని, ఎవరికి ఏవిధమైన వ్యక్తులకు టికెట్లు ఇచ్చారో ప్రజలు గమనిస్తున్నారని ఆ విధంగా తీర్పునిస్తారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీఠం చేస్తున్నట్లు మాటలు చెప్పినప్పటికీ ప్రాతినిధ్యం కొరవడిందని,మహిళలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం తప్ప మహిళలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేకపోవడంతోనే టికెట్లు జాబితాలో ప్రాతినిధ్యం కొరవడిందని శ్రీధర్ బాబు ఆరోపించారు.

రుణ మాఫీ కాదు... మిత్తి మాఫీ పథకం

రైతులు తీసుకున్న రుణాలపై నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం మాఫీ చేయకుండా ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అది రుణమాఫీ పథకం కాదని మిత్తి మాఫీ పథకం గా మారి పోయిందన్నారు. రైతులకు రుణం తో పాటు వడ్డీ చెల్లించినప్పుడే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులకు మేలు చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పట్టిన ఈ పథకం పట్ల రైతులకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. వైన్స్ షాపుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతుల పైన లేదని అన్నారు. రాష్ట్రంలో భూములు విక్రయించడం , మద్యం షాపులకు టెండర్లతో వస్తున్న ట్యాక్స్ ద్వారా మిత్తి మాఫీ పథకం నడిపిస్తున్నారని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన ధాన్యానికి కటింగ్ పెట్టడం ద్వారా రైతుల నష్టపోయారని, సరైన సమయంలో డబ్బులు చెల్లించలేదని అన్నారు. 2008 సంవత్సరంలో ఒక్క కలం ఓటుతో వైయస్సార్ రైతుల రుణాలు మాఫీ చేశారని, కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని రైతుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు వన్న వంశవర్ధన్ రావు ఎంపీపీ పంతగాని సమ్మయ్య, నాయకులు ప్రభాకర్ రెడ్డి, కోట రాజబాబు, విలాస్ రావు ఎంపిటిసి జాడి మహేశ్వరి పాల్గొన్నారు.

Next Story