బ‌స్సు, అటో ఢీ.. ఇద్ద‌రికి గాయాలు..

by Bhanu |

ఏదురెదురుగా వ‌స్తున్న బ‌స్సు, అటో ప్ర‌మాదవ శాత్తు ఢీ కొట్టుకొవ‌డంతో రోడ్డు ప్ర‌మాదం నెల‌కొని అటోలో ప్ర‌యాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘ‌ట‌న ఏటూరునాగారం మండ‌లం చిన్న‌బోయిన ప‌ల్లి గ్రామ స‌మీపంలో చోటు చేసుకుంది.

బ‌స్సు, అటో ఢీ.. ఇద్ద‌రికి గాయాలు..
X

దిశ‌, ఏటూరునాగా: ఏదురెదురుగా వ‌స్తున్న బ‌స్సు, అటో ప్ర‌మాదవ శాత్తు ఢీ కొట్టుకొవ‌డంతో రోడ్డు ప్ర‌మాదం నెల‌కొని అటోలో ప్ర‌యాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘ‌ట‌న ఏటూరునాగారం మండ‌లం చిన్న‌బోయిన ప‌ల్లి గ్రామ స‌మీపంలో చోటు చేసుకుంది. స్థానికుల క‌థ‌నం మేర‌కు..ఏటూరునాగారం నుండి హ‌న్మ‌కొండ కు వెలుతున్న ఆర్‌టీసీ బ‌స్సు, మెట్టుప‌ల్లి గ్రామం నుండి వాజేడు గ్రామంకు వెలుతున్న అటో చిన్న‌బోయిన ప‌ల్లి వే బ్రిడ్జి స‌మీప జాతీయ ర‌హ‌దారి పై ముందు వెలుతున్న ఇసుక లారీనీ దాటించ బోయి ప్ర‌మాద‌వ శాత్తు ఒక‌దానిని మ‌రోక‌టి ఢీ కొట్టుకున్నాయి. ఈ రొడ్డు ప్ర‌మాదంలో అటోలో ప్రయాణిస్తున్ని ఇల్లందుకు చెందిన ప్ర‌శాంత్‌(35) అనే వ్య‌క్తికి కాలు విర‌గగా, వాజేడు గ్రామానికి చెందిన వెంక‌టాల‌క్ష్మి(13) అనే అమ్మాయికి స్వ‌ల్ప గాయాలైయ్యాయి. కాగా గాయాలపాలైన భాదితులను చికిత్స నిమిత్తం స్థానికులు అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం సామాజికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.



Next Story