గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ

by Dishanational1 |
గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ
X

దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని గుత్తికోయ గూడెంలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కమ్యునిటీ కాంటాక్ట్ లో భాగంగా స్పెషల్ పార్టీ సిబ్బందితోపాటు మండల కేంద్రంలోని గుత్తికోయ గూడెంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం గిరిజనులతో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేఖ కార్యకలాపాలు నడిపేవారికి సహకరించడం చట్ట రీత్యా నేరమని ప్రజలకు ఉద్భోదించారు. పిల్లలను పాఠశాలకు పంపి మంచిగా చదువు చెప్పించాలని, వారికి మంచి భవిష్యత్తును అందించాలని సూచించారు.

కానిస్టేబుల్ అశోక్ సహాయం

గుత్తికోయ గూడెంలో నివసిస్తున్న 16 గిరిజన కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పలిమెల స్టేషన్ లోని కానిస్టేబుల్ అశోక్ తండ్రి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రుల పేరుతో నిత్యావసరాలైన పదిహేను కేజీల బియ్యంతోపాటు వంటనూనె, పప్పులు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, శర్కర, చాపత్త, కారంపొడి మొదలైనవి గిరిజనులకు సరఫరా చేశారు. అనంతరం పిల్లలకు స్వీట్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్ తోపాటు సివిల్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు.


Next Story

Most Viewed