పల్లె ప్రకృతి వనం ధ్వంసం.. వేల మొక్కలను నరికివేసిన గుర్తు తెలియని వ్యక్తులు

by Disha Web Desk 23 |
పల్లె ప్రకృతి వనం ధ్వంసం.. వేల మొక్కలను నరికివేసిన గుర్తు తెలియని వ్యక్తులు
X

దిశ,కొత్తగూడ : ప్రతి గ్రామానికి ఆహ్లాద కరమైన, అందమైన వాతావరణం కొరకు ప్రకృతి వనాలలో పూలతో రకరకాల చెట్లను ఏర్పాటు చేశారు. చూపరులను ఆకర్షింప చేసే ఆ ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టి చెట్లను నరికిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి గ్రామంలో లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. వేలు బెల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని అగ్గి పాలు చేశారు. 4 లక్షల రూపాయల విలువ చేసే పూలు, పండ్ల మొక్కలు నీటి మోటారు పైపులు కాలి బూడిద అయ్యాయి.

అదే గ్రామంలో మెగా బృహత్ పల్లె ప్రకృతి వనం దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో రకరకాల మొక్కలతో నిర్మించిన ప్రకృతి వనం పది లక్షల రూపాయల వ్యయంతో నాటిన మొక్కలు. అవి నేడు పెద్ద పెద్ద చెట్లుగా ఎదిగిన వాటిని భారీ మొత్తంలో గొడ్డళ్ళతో నరికి నేల మట్టం చేశారు. ఇంత పెద్ద భారీ నష్టం జరిగిన కానీ ఇటు వైపు కన్నెత్తి చూడని పాలనాధికారులు. ఇంతవరకు గ్రామ కార్యదర్శి గాని గ్రామ ప్రత్యేక అధికారి గానీ కనీసం పరిశీలించటానికి ఇటు వైపు రాలేదు అంటే వారికి గ్రామం పైన ఏ స్థాయిలో శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది. అంటూ ఇకనైనా సంబంధిత అధికారులు గ్రామానికి విచ్చేసి ఘటన ప్రాంతాలను పరిశీలించి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed