- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేం నరేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సలహాదారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహబూబాబాద్ నియోజవర్గ పర్యటనలో భాగంగా సొమ్లాతండాలో హెలిప్యాడ్ వద్దకు ఇన్నోవా క్రిస్టా కారులో వేం నరేందర్ రెడ్డి వెళ్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా కారులోంచి బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
Next Story






