ఆగిపోయిన విమానాల రాకపోకలు.. అధికారులతో కేంద్రమంత్రి సుదీర్ఘ చర్చలు

by Naga Rani Yarlagadda |

దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు.

ఆగిపోయిన విమానాల రాకపోకలు.. అధికారులతో కేంద్రమంత్రి సుదీర్ఘ చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఏటీసీ (Air Traffic Control) కుప్పకూలడంతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సమస్యపై దృష్టి సారించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ ఆయన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనే గడిపారు. అర్థరాత్రి వరకూ ఏటీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సహా మరికొన్ని ఎయిర్ పోర్టుల్లో టెక్నికల్ సమస్యలు రావడంతో.. ఉదయం నుంచీ అధికారులతో సమీక్షలు చేపట్టారు. ఏటీసీ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యల్ని అధిగమించేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ, డీజీసీఏ, ఎయిర్ పోర్టు అధికారులతో చర్చిస్తున్నారు. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తి విమానాలు ఆలస్యం కావడంతో మంత్రి మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు.

Next Story