ఎంతో మంది వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

by Disha Web Desk 19 |
ఎంతో మంది వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిలో పయనిస్తోందని, కానీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణలో ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ జవాబు చెప్పాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిలదీశారు. ఇవాళ కరీంనగర్‌లోని జమ్మికుంటలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించారు. తనకు తెలంగాణ గురించి తెలుసని, ఇక్కడి ఉద్యమం, కల్చర్ గురించి తెలుసన్నారు. రాణి రుద్రమదేవి, కుమురంభీం లాంటి ఎంతో మంది వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని కొనియాడారు.

1984లో బీజేపీ దేశంలో రెండు లోక్ సభ స్థానాలు గెలిస్తే.. ఒకటి గుజరాత్.. రెండు తెలంగాణ నుంచి జంగారెడ్డి ఎన్నికయ్యారని గుర్తుచేశారు. 24 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ పాలన చేసిందని, గుజరాత్ అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని, బీజేపీ పార్టీ కూడా ఉద్యమం చేసిందని అన్నారు. స్వరాష్ట్రం సాధనలో క్రెడిట్ తెలంగాణ ప్రజలదని అన్నారు. పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి ఒక కుటుంబానికే ప్రైవేట్ లిమిటెట్ లాగా పరిమితం అయ్యిందన్నారు. ఏపీ, తెలంగాణలో సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందన్నారు.


Next Story

Most Viewed