2024లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటైనా వస్తుందా?: Kishan Reddy

by Disha Web Desk 2 |
2024లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటైనా వస్తుందా?:  Kishan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భైంసాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. వెయ్యిమంది కేసీఆర్‌లు, వెయ్యిమంది ఓవైసీలు వచ్చినా మోడీని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని ఐదోవిడత ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే జైలుకైనా వెళ్తామని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్ని దోపిడీలను వెలికితీసి దర్యాప్తు చేయిస్తామని అన్నారు. 2024లో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటైనా వస్తుందా? అని ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కదా అని ఏం చేసినా నడుస్తుందనుకుంటే పొరపాటు చేసినట్లే అని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులకూ కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సర్కార్ చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోయారని సూచించారు.

Next Story