బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ట్వీట్ వార్.. ఇది పార్టీ హ్యాండిల్లో పోస్ట్ చేయడానికి సిగ్గుండాలని కౌంటర్

by Disha Web Desk 14 |
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ట్వీట్ వార్.. ఇది పార్టీ హ్యాండిల్లో పోస్ట్ చేయడానికి సిగ్గుండాలని కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. వివిధ పార్టీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి డైలాగులు, సవాళ్లు విసురుకుంటున్నారు. మరోవైపు వారి పార్టీలకు చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఒకరిపై ఒకరు విమర్శలు, కౌంటర్‌లు ఇచ్చుకుంటాయి. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు చేసుకున్నాయి. మొదటి బీజేపీ పార్టీ ట్వీట్ చేస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్లలో ఒక్క స్టార్టప్ ను కూడా విజయవంతంగా స్థాపించిన దాఖలాలు లేవని తెలంగాణ రాష్ట్ర ఐటీ బ్యూరోక్రాట్ హెడ్ జయేష్ రంజన్ అన్నారని పోస్ట్ చేసింది. టీ-హబ్.. వీ-హబ్.. లాంటివి స్థాపించామని డాబులు పోయిన అప్పటి ఐటీ శాఖ మంత్రి.. అవన్నీ తన సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం చేసినవే అని, నిజానికి ఆ సంస్థల వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరూ లేరని జయేష్ రంజన్ చెప్పారని ఆరోపించింది. ప్రపంచంలోనే అతి గొప్ప ఐటీ శాఖ మంత్రి గా ఫోజులు కొట్టి, విదేశీ యాత్రలకు కొన్ని వందల కోట్ల రూపాయలు తగలేసిన కేటీఆర్ చేసిందల్లా.. ప్రజలకు అబద్ధాలు చెప్పి, నమ్మించి, మోసం చేయడమేనని విమర్శలు చేసింది.

పార్టీ హ్యాండిల్లో పోస్ట్ చేయడానికి సిగ్గుండాలి

ఈ బీజేపీ ట్వీట్‌పై బీఆర్ఎస్ అధికార ఖాతా కౌంటర్ ఇచ్చింది. ‘వాడెవడో కాంగ్రెస్ కరపత్రికలో నోటికి వచ్చింది రాస్తే దాన్ని మీ పార్టీ హ్యాండిల్లో పోస్ట్ చేయడానికి సిగ్గుండాలి.. ఇది అసలు నిజం స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఎన్నో సార్లు ప్రశంసించింది. అవార్డులు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి బీజేపీ వంత పాడుతుంది. మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు’ అని బీఆర్ఎస్ కౌంటర్ ట్వీట్ చేసింది.

Next Story

Most Viewed