వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ఈ రూట్లు బంద్!

by Disha Web Desk 19 |
వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ఈ రూట్లు బంద్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం ఈ నెల 30వ తేదీన (ఆదివారం) ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ఓపెనింగ్ చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు ముఖ్య సూచన చేశారు. ఈ నెల 30వ తేదీన నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో రేపు పూర్తిగా ట్రాఫిక్ అంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

రేపు (ఆదివారం) ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నూతన సెక్రటేరియట్ ప్రాంతంలో ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుండి వచ్చే వాహనాలు నెక్లస్ రోడ్డు వైపు, ఇక్బాల్ మినార్ నుండి వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వైపు, ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనలను ఇతర రూట్లకు మళ్లీస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎల్లుండి (సోమవారం) ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లస్ రోడ్, లుంబినీ పార్క్ మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.



Next Story

Most Viewed