మాచారెడ్డి రైతుబంధు అధ్యక్షుడిపై మాజీ ఎమ్మెల్యే గంప బూతు పురాణం

by Disha Web Desk 15 |
మాచారెడ్డి రైతుబంధు అధ్యక్షుడిపై మాజీ ఎమ్మెల్యే గంప బూతు పురాణం
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండల రైతుబంధు అధ్యక్షులు బుక్యా నర్సింలుపై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బూతు పురాణం లంకించుకున్నాడు. దీనిపై మాచారెడ్డి మండలంలో జోరుగా చర్చ సాగుతుంది. నోటితో చెప్పరాని పదాలు వాడడంపై చర్చ సాగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అధికారులపై మాట్లాడిన బూతులు ప్రస్తుతం పార్టీ నాయకులపై ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ కేడర్ ను దూరం చేసుకోవడం ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈనెల 7న కామారెడ్డిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించాల్సిన కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయడంలో భాగంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశంలో పాల్గొన్న ద్వితీయ శ్రేణి నాయకులు గంప ఆగ్రహంపై

ముక్కున వేలేసుకున్నారు. సమావేశంలో మొదటి వరుసలో కూర్చున్న భూక్యా నర్సింహులు ను రెండో వరుసకు పంపించారు. అనంతరం మరో నాయకుడు రావడంతో మూడవ వరుసకు తరలించారు. దీంతో భుక్యా నర్సింహులు తిరుగుబాటు చేశారు. మేము ఎప్పటికీ వెనక బెంచ్ లోనే ఉండాలా అని ప్రశ్నించారు. తమ్ముడు కౌన్సిలర్ గా ఉంటే కాపాడుకోలేని నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అంటూ బూతు పురాణం లంకించుకున్నాడు. పోతే పో.. అనగానే నా పార్టీ లోకి నువ్వు వచ్చావు నీ పార్టీలోకి నేను రాలేను అని భుక్యా నర్సింహులు సమాధానం ఇచ్చారు. నేనేం వట్టిగా రాలేదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చాను. ఎమ్మెల్యే అంటే ఆషామాషీ అనుకున్నావా అంటూ బూతు పురాణం వదలలేదు. విషయం తెలుసుకున్న భుక్యా నర్సింహులు అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను పరామర్శిస్తున్నారు. మాజీ మావోయిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఆయన మొదటి నుంచి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రైతుబంధు అధ్యక్షుడిగా పదవిలో ఉన్నాడు. ఎస్టీ నాయకుడని కూడా చూడకుండా మాజీ ఎమ్మెల్యే బూతులు తిట్టడంపై మండలంలో సర్వత్రా చర్చ సాగుతుంది.

అట్రాసిటీ కేసు ఆలోచనలో భుక్యా...?

తనను ఎస్టీ నాయకుడని కూడా చూడకుండా బూతులు తిట్టడంపై అట్రాసిటీ కేసు పెట్టే ఆలోచనలో మాచారెడ్డి రైతుబంధు అధ్యక్షుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన శ్రేయోభిలాషులు ఎస్టీ సంఘాలతో చర్చిస్తున్నట్లు సన్నిహితుల ద్వారా సమాచారం. మరి కొందరు గంప వ్యవహార వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో చావు దెబ్బ తిన్న బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల సానుభూతి ఏమో కానీ పార్టీ కేడర్ అసంతృప్తికి గురికావడంపై చర్చ సాగుతుంది.

Next Story

Most Viewed