- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేట డీసీసీ చీఫ్ నర్సారెడ్డికి నోటీసులు.. పార్టీ అంతర్గతాలపై మీడియాతో మాట్లాడరాదని నేతలకు మల్లు రవి హెచ్చరిక
సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌నోటీసులు ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో : సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి (DCC President Narsa Reddy)కి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ (TPCC Disciplinary Committee) షోకాజ్‌నోటీసులు ఇచ్చింది. ఆయనపై గజ్వేల్దళితులు ఫిర్యాదు చేశారని, దానిపైన వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. క్రమశిక్షణ కమిటికి అందిన ఫిర్యాదులపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం కమిటీ గాంధీ భవన్లో సమావేశమైంది. ఈ సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న అనేక ఫిర్యాదులు చర్చించారు. సమావేశం అనంతరం మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్‌లో జరిగిన వివాదానికి సంబంధించి నర్సారెడ్డిపై ఫిర్యాదులు అందాయన్నారు. దీనిపై నర్సారెడ్డిని సమావేశానికి పిలిచి మాట్లాడామని, నోటీసులకు జవాబు ఇవ్వాలని తెలిపామన్నారు. సిద్దిపేటలో పార్టీ తరఫున పోటీ చేసిన పూజల హరికృష్ణపై టీపీసీసీ చీఫ్తనకు వచ్చిన ఫిర్యాదును కమిటికి వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్‌కి ఇచ్చారని, దానిపై చర్చించి పూజల హరికృష్ణకు నోటీసులు ఇస్తున్నామని, వారం, పది రోజుల్లో వివరణకు సమయం ఇస్తామని మల్లు రవి చెప్పారు. ఫిర్యాదులు, వివరణలపై మరోసారి భేటీ అయిన తర్వాత నిర్ణయాలుంటాయన్నారు.
రాజ్‌గోపాల్‌రెడ్డిపై ఫిర్యాదులు అందలేదు, చర్చ లేదు
ఇటీవల వరుసగా వివాదాస్పద కామెంట్లు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చ జరుగలేదని మల్లు రవి చెప్పారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్చిస్తామే తప్ప బయట జరుగుతున్న ప్రచారం, మీడియాలో వచ్చిన వార్తలపై కమిటీ చర్చించదన్నారు.
ఏ స్థాయి నేత అయినా పార్టీ అంతర్గత విషయాలు మీడియాతో మాట్లాడకూడదు
పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఏ నేత అయినా సరే పార్టీలోని అంతర్గత అంశాలను మీడియాతో పంచుకోకూడదని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీలోని నేతలకు ఏ రకమైన సమస్యలున్నా స్థానిక డీసీసీ, పీసీసీ, సీఎం, మీనాక్షి నటరాజన్దృష్టికి అయినా తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలని, క్రమ శిక్షణతో పనిచేయాలని మల్లు రవి సూచించారు. అంతే కానీ, వ్యక్తులపై కోపంతో ఫిర్యాదులు చేయడం, మీడియాతో మాట్లాడటం సరికాదన్నారు. దాని వల్ల పార్టీకి, ఆ నేతకూ నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. నేతలు సంయమనం పాటించాలని రాబోయే లోకల్‌బాడీ ఎన్నికల్లో సమన్వయంతో పని చేయాలన్నారు. కాంగ్రెస్‌ను వీడిన వారు మళ్లీ పార్టీలోకి రావాలని తాను కోరుతున్నట్లు మల్లు రవి చెప్పారు. వరంగల్ నేతల విభేదాలపై చర్యలపై పీసీసీకి కమిటీ వేయాలని చెప్పామని, సీఎం దృష్టిలో ఉందని, పీసీసీదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు.
కేటీఆర్తాను తవ్వకున్న గుంటలో తాను పడ్డారు
కేటీఆర్తాను తొవ్వకున్న గుంటలో ఆయనే పడ్డారని, పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ శ్రీరంగ నీతులు చెప్తున్నారని మల్లు రవి మండిపడ్డారు. వారు రాజకీయనేతలు, మేము సన్యాసులమా అని ఆయన ఘాటుగా స్పందించారు. గతంలో కేసీఆర్అవసరం లేకున్నా కాంగ్రెస్ లో గెలిచినోళ్లను తన పార్టీలో చేర్చుకున్నారని, ప్రతిపక్ష హోదా, దానితో పాటు కేబినెట్ హోదా కాంగ్రెస్‌కు లేకుండా చేశారని మల్లు రవి మండిపడ్డారు. పార్టీ మారిన అంశంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్ వివరణ అడుగుతారని, పార్టీ మారలేదు అని ఎమ్మెల్యేలు చెప్తున్నారని, దానిపై స్పీకర్నిర్ణయం తీసుకుంటారన్నారు.
దళితుల సహకారంతోనే ఎదిగాను: నర్సారెడ్డి
గజ్వేల్జరిగిన అంశంలో తన వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారని, త్వరలోనే జవాబు ఇస్తానని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి చెప్పారు. గజ్వేల్సమావేశంలో ప్రోటోకాల్పాటించకుండా వేదిక ఎక్కితే తమ కార్యకర్తలు వేదిక దగ్గర అబ్యంతరం చెప్పారన్నారు. అంతే తప్ప తాను దళితలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. తన నియోజకవర్గంలో జనరల్ కేటగిరి ప్రాంతాల్లో కూడా దళితులకు పదవులు ఇచ్చానని నర్సారెడ్డి చెప్పారు. తాను దళితుల సహకారంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తనకు స్థానికంగా ఉన్న ఇద్దరు, ముగ్గరు నేతలకు పడటం లేదన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌ని తనపై ఫిర్యాదు చేసిన నేత ఇంటికి ఆహ్వానించారని, శాలువా కప్పి, పటాకులు కాల్చారని నర్సారెడ్డి ఆరోపించారు. మేము కూడా ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళామన్నారు.






