Sama Vs KTR : ఇది కమీషన్ల కక్కుర్తితో కూలిన కాళేశ్వరం తెచ్చిన కరువు : సామ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-22 08:51:15  IST  )

రాష్ట్రంలో భూగర్భ జలాల క్షీణత..కరువు పరిస్థితుల(Drought conditions)పై కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress and BRS) ల మధ్య మాటల యుద్ధం(War of words) కొనసాగుతోంది.

Sama Vs KTR : ఇది కమీషన్ల కక్కుర్తితో కూలిన కాళేశ్వరం తెచ్చిన కరువు : సామ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో భూగర్భ జలాల క్షీణత..కరువు పరిస్థితుల(Drought conditions)పై కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress and BRS) ల మధ్య మాటల యుద్ధం(War of words) కొనసాగుతోంది. భూగర్భ జలాలు పడిపోతున్నందునా రైతులు బోర్లు వేసి అప్పుల పాలు కావద్ధంటూ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి(Kodanda Reddy) చేసిన ప్రకటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy government) తెచ్చిన కరువు అంటూ కౌంటర్ వేశారు.

కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy)మరో కౌంటర్ వేశారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు కమీషన్లకు కక్కుర్తి పడి లక్షా నలభై ఏడు వేల కోట్లు పెట్టి..కూలిన కాళేశ్వరం కట్టిన కచరా తెచ్చిన కరువు అంటూ సామ మండిపడ్డారు. పది సంవత్సరాలు కృష్ణ పరీవాహక ప్రాజెక్టులను పెండింగ్ పెట్టి..రాయలసీమ రాగి సంకటి..నాటు కోడి పులుసు తిని తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టిన కల్వకుంట్ల దొంగలు మిగిల్చిన కరువు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.

పది సంవత్సరాల మీ పాలనలో నేటికీ నాటి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీదనో లేదా కాలం మీదనో ఆధారపడి జీవించే పరిస్థితి కొనసాగుతుందని గుర్తు చేశారు. మీరు కట్టిన ప్రాజెక్టులతో మీ కుటుంబం జేబులు మాత్రమే నిండినాయి తప్ప.. తెలంగాణలో చెరువులు నిండలేదంటూ కేటీఆర్ పై సామ విమర్శలు గుప్పించారు. కూలిన..కుంగిన ప్రాజెక్టులు..దోచిపెట్టిన నీళ్ళ సాక్షిగా.. మీరు తెలంగాణకు చేసిన ద్రోహానికి మీ పార్టీని బొంద పెట్టడం ఖాయమంటూ కేటీఆర్ ను సామా రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story
null