నా కొడుకును హింసించారు.. వారిపై Minister Malla Reddy ఫైర్

by Disha Web Desk 4 |
నా కొడుకును హింసించారు.. వారిపై Minister Malla Reddy ఫైర్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : తన కొడుకును ఐటీ అధికారులు హింసించారని మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. దొంగతనం చేస్తున్నామా..?.. క్యాసినో అడిస్తున్నామా?.. ఇంత దుర్మార్గమా..? తన కొడుకును కొట్టినట్లు ఉన్నారు. దొంగ వ్యాపారాలు చేస్తున్నామా..? రూ.30 వేలకు ఎంబీఏ, రూ.65 వేలకు ఇంజనీరింగ్ చదివిస్తున్నాం. కేంద్రం 200 మంది అధికారులను పంపించి మమ్మల్ని హింసిస్తోందంటూ ఐటీ అధికారులపై మంత్రి విరుచుకుపడ్డారు. రాజకీయ కక్షల వల్ల నా కొడుకును కొట్టినట్లు ఉన్నారని ఆరోపించారు. తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై వార్తలను టీవీలో చూసానన్నారు. కాగా మంత్రి మల్లారెడ్డిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగుతుండగా మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారు జాము 5 గంటల నుంచి ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీలలో మల్లారెడ్డి‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు సంస్థలపై మెరుపుదాడులు చేశారు. మల్లారెడ్డి కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి.

కుమారుడికి అస్వస్థత..

ఐటీ దాడులు మల్లారెడ్డి కుటుంబ సభ్యుల్లో కలకలం రేపాయి. రాత్రంతా మంత్రి కుమారుడు చామకూర మహేందర్ రెడ్డిని తన నివాసంలో విచారించారు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో మహేందర్ రెడ్డికి చాతీలో నొప్పి రావడంతో సూరరాంలోని మల్లారెడ్డి సొంత ఆసుపత్రి నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం చేర్పించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మంత్రి మల్లారెడ్డి టీవి చూడగా, తన పెద్ద కుమారుడు చాతీ నోప్పితో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

ఆసుపత్రికి మల్లారెడ్డి..

ఐటీ తనిఖీల్లో భాగంగా నాకు సెల్ ఫోన్ ఇవ్వడంలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రంతా తన కొడుకును అధికారులు విచారణ చేశారన్నారు. నన్ను ఏమి అనలేదు. నా పెద్ద కొడుకు సీరియస్‌గా ఉన్నారు. డ్రామాలు చేస్తున్నారు. దొంగల్లా వ్యవహారిస్తున్నారు. పేద పిల్లలకు విద్యను అందిస్తున్నాం. నేను ఆసుపత్రికి వెళ్తా.. అని బతిమిలడినా విడిచి పెట్టడం లేదు. నేను ఆసుపత్రికి వెళ్తున్నా.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మండి పడ్డారు. తన భార్యతో కలిసి మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. కాగా మల్లారెడ్డి అల్లుడి తల్లి వసుంధర సైతం నిన్న ఆసుపత్రి పాలైనట్లు తెలిసింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ అకౌంటెంట్‌తోపాటు తన మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డిలను మంగళవారం నుంచి ఐటీ అధికారులు రహాస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలిసింది.

Read more:

1.మల్లారెడ్డి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం...ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాగ్వాదం..

Next Story

Most Viewed