Minister Malla Reddy ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం.. ఐటీ అధికారులతో Malla Reddy వాగ్వాదం..

by Mahesh |
Minister Malla Reddy ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం.. ఐటీ అధికారులతో Malla Reddy వాగ్వాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి కి ఛాతిలో నొప్పి రావడంతో అతన్నిసురారం ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మల్లారెడ్డి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని తాను అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలని ఐటీ అధికారులతో మంత్రి వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ వాతావరణం గందరగోళంగా మారింది. దీంతో మల్లారెడ్డి తన కారులో తన కుమారుడు ఉన్న సురారం ఆస్పత్రికి బయలు దేరాడు. మంత్రితో పాటు ఓ ఐటీ అధికారి కూడా కారులో వెళ్లినట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed