వర్కవుట్స్ చేస్తున్నప్పుడు ఈ పని మాత్రం చేయకండి.. ప్రమాదంలో పడతారు!

by Javid Pasha |
వర్కవుట్స్ చేస్తున్నప్పుడు ఈ పని మాత్రం చేయకండి.. ప్రమాదంలో పడతారు!
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, పరిశుభ్రత ఎంత ముఖ్యమో శారీరక శ్రమ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తుంటాం. కొందరు జిమ్ సెంటర్లకు, ప్లే గ్రౌండ్స్‌కు వెళ్లి హెవీ వర్కవుట్స్ కూడా ప్రయత్నిస్తుంటారు. ఇదంతా మంచిదే కానీ, వర్కవుట్స్ సందర్భంగా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* ఫిట్‌నెస్ కోసం ఈరోజుల్లో చాలామంది జిమ్‌లలో వర్కవుట్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సందర్భంగా కొందరు స్కిన్ అలెర్జీలు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. సమ్మర్‌లో అయితే ఇవి మరింత ఎక్కువ. అందుకు కారణం వర్కవుట్స్ వేళ చేస్తున్న కామన్ మిస్టేక్స్. అవేంటంటే.. జిమ్‌కు వెళ్లే ముందు మహిళలైతే మేకప్ వేసుకొని వెళ్లడం, పురుషులైతే వివిధ లోషన్లు, పెర్ఫ్యూమ్‌లు రాసుకొని కసరత్తులు చేయడం, అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు పదే పదే శరీరాన్ని, ముఖాన్ని గరుకైన టవల్‌తో రుద్దడం, వ్యాయమం తర్వాత స్నానం చేయకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.

* కొందరు మరీ టైట్‌గా ఉండే దుస్తులు లేదా హెడ్ బ్యాండ్స్ ధరించి వర్కవుట్స్ చేస్తుంటారు. దీనివల్ల కూడా స్కిన్ అలెర్జీలు వస్తాయని చర్మ వ్యాధి నిపుణులు అంటున్నారు. అలాగే మ్యాట్స్, గ్లోవ్స్ వంటి సాధారణ లేదా రసాయనాలతో తయారైన జిమ్ గేర్‌లను యూజ్ చేస్తుంటారు. వీటివల్ల కూడా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకి చర్మంపై మొటిమలు, దద్దుర్లు, పుండ్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిమ్ గేర్‌లు నాణ్యమైనవి, కెమికల్స్ రహితమైనవి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంవల్ల సమ్మర్‌లోనే కాదు, ఏ సీజన్లో వర్కవుట్స్ చేసినా ఎటువంటి స్కిన్ ఇష్యూస్ తలెత్తకుండా ఉంటాయి.

Next Story

Most Viewed