- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. కేయూలో తీవ్ర ఉద్రిక్తత..!
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పు నిర్ణయం స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. స్టేట్ అఫిషియల్ లోగోలో ప్రస్తుతం

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పు నిర్ణయం స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. స్టేట్ అఫిషియల్ లోగోలో ప్రస్తుతం ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ డెసిషన్‌పై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భగ్గుమంటున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ అస్థిత్వంపై దాడి చేస్తోందని విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఇదే ఇష్యూపై వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది.
రాష్ట్ర అధికారిక చిహ్నాంలో కాకతీయ కళాతోరణం తొలగించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ కేయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి విద్యార్థులు యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు పలువురు స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.






