నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి.. తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి

by Dishafeatures2 |
నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి.. తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పెరిగిన నిత్యావసరాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని తెలుగు మహిళా విభాగం డిమాండ్ చేసింది. ధరలు తగ్గించాలని కోరుతూ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుగా ఉన్న రహదారిపై కూరగాయాలతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిత్యావసరాల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని.. సామాన్యులకు, పేద మధ్యతగతి కుటుంబాలు జీవించడమే కష్టంగా మారుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలలో భాగంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.

ఇదేనా బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు. దళారులు రాజ్యం ఏలుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గృహిణి బంధు ప్రకటించి కూరగాయలు, నిత్యావసరాలను సబ్సిడీపై రైతు బజార్లు, విక్రయ కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఛలో ప్రగతి భవన్ చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, అధికార ప్రతినిధి సూర్యదేవర లత, సాయి తులసీ, సుజాత, పద్మచౌదరి, ధనలక్ష్మి, జాన్సీ, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed