స్థానికులు, అధికారులకు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు బోనుకు చిక్కిన చిరుత

by Disha Web Desk 4 |
స్థానికులు, అధికారులకు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు బోనుకు చిక్కిన చిరుత
X

దిశ, కొత్తపల్లి: గత కొన్ని రోజులుగా లేగ దూడలను హతమారుస్తూ.. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ వచ్చిన చిరుత పులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. మండల పరిధిలోని నందిగామ, దుప్పటి గట్టు, గోకుల్ నగర్, గొర్లోని బావి పరిసరాలలో గత కొన్ని వారాలుగా సంచరిస్తూ ప్రజలను ఆందోళనలకు గురిచేస్తూ వస్తోంది. దీనితో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. లేగ దూడలను హతమార్చిన విధానాలు, పాదముద్రలను సేకరించిన అధికారులు అది చిరుతపులిగా గుర్తించారు. సోమవారం రాత్రి నందిగామ పరిసర ప్రాంతాలలో చిరుత ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో బోను ఏర్పాటు చేశారు. ఎ ట్టకేలకు చిరుత బోనులో చిక్కడెంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బోనులో చిక్కిన చిరుతను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed