మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. మోడీ ఎక్కడ ఓటు వేయనున్నారంటే..?

by Disha Web Desk 4 |
మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. మోడీ ఎక్కడ ఓటు వేయనున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. 11 రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 93 స్థానాలకు మొత్తం 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడతలో 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవం కావడంతో 93 స్థానాల్లో పోటీ జరుగుతోంది. గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని మోడీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ మొత్తం 26 స్థానాలకు 25 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఛత్తీస్ గఢ్ 7, బిహార్ 5, అస్సాం 4, బెంగాల్ 4, గోవా 2 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యులో రెండు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగుతోంది. జమ్ముకశ్మీర్‌లో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీ ఆరో విడతకు మార్పు చేశారు.

మధ్యప్రదేశ్‌లో రెండో విడతలో జరగాల్సిన ఒక స్థానానికి ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. గుజరాత్ గాంధీనగర్ నుంచి బరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బరిలో ఉన్నారు. గుజరాత్ నుంచే కేంద్రమంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా పోటీలో ఉన్నారు. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో కీలకమైన 11 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడతలో యూపీలోని పదిస్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మెయిన్ పురి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 9 సీట్లకు మూడో విడతలో పోలింగ్ జరుగుతోంది. గుణ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీలో ఉన్నారు. విదిశ నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీలో ఉన్నారు.

Next Story

Most Viewed