- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News: బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ.. ఫోటోలు వైరల్
పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డిని ఓ మహిళ చెప్పుతో కొట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

దిశ వెబ్ డెస్క్: పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డిని ఓ మహిళ చెప్పుతో కొట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట - పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసింది.
అయితే మోహన్ రెడ్డి రావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. పార్టీ మారుతావా అంటూ.. జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనను చెప్పుతో కొట్టింది. కాగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మోహన్ రెడ్డి సమీప బంధువు. ఓ ఎమ్మెల్యే బంధువు, పీఏసీఎస్ చైర్మన్ ను ఓ మహిళ చెప్పుతో కొట్టడం అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
పార్టీ మారాలని చూసిన బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2024
నర్సంపేట - పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండగా రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న… pic.twitter.com/4OlHyRIj9E






