లోక్ సభలోనూ బీఆర్ఎస్ గా మార్పు.. సర్క్యూలర్ విడుదల చేసిన డిప్యూటీ సెక్రటరీ

by Dishafeatures2 |
లోక్ సభలోనూ బీఆర్ఎస్ గా మార్పు.. సర్క్యూలర్ విడుదల చేసిన డిప్యూటీ సెక్రటరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారింది. ఈ మేరకు పార్లమెంట్ హౌజ్ బుధవారం బులిటెన్‌ విడుదల చేసింది. లోక్ సభలో బీఆర్‌ఎస్‌ తరఫున 9మంది సభ్యులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. బీఆర్‌ఎస్‌ నేతగా నామా నాగేశ్వర్ రావు ఉన్నారని తెలిపింది. పార్టీ పేరు మార్చాలని లోక్ సభ చైర్మన్‌కు ఫ్లోర్‌ లీడర్‌ నామా నాగేశ్వర్ రావు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చైర్మన్‌ ఆమోదంతో పార్లమెంట్ హౌజ్ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, పార్టీల వారీగా సభ్యుల సంఖ్యను లోక్ సభ డిప్యూటీ సెక్రేటరీ ఉత్తమ్ చంద్ర రాయ్ ప్రకటించారు. గతేడాది అక్టోబర్‌ టీఆర్‌ఎస్‌ పేరు బీఆర్‌ఎస్‌గా మారుస్తున్నట్లు పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.


Next Story

Most Viewed