శ్రీశైలం రహదారిపై యాత్రికులకు దర్శనమించిన ఎలుగుబంటి

by Disha Web Desk 11 |
శ్రీశైలం రహదారిపై యాత్రికులకు దర్శనమించిన  ఎలుగుబంటి
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో శనివారం అమ్రాబాద్ మండలం వటవట్లపల్లి గ్రామ సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై యాత్రికులకు ఎలుగుబంటి దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా అడవి శాఖ దోమల పెంట రేంజి క్షేత్ర అధికారి గురు ప్రసాద్ దిశతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. జాతీయ రహదారి పంట రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని దీనిని వాహనదారులు గమనించాలన్నారు. అలాగే అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో వాహనాలు పరిమిత వేగంతో వెళ్లాలని హెచ్చరిస్తూ నిబంధనలు అతిక్రమిస్తే అటవీశాఖ వైల్డ్ లైఫ్ యాక్టివ్ ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని సూచించారు.



Next Story

Most Viewed