- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం లకు ధన్యవాదాలు.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకంతో అభ్యర్థులకు చేయూత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు అని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar Goud) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకంతో అభ్యర్థులకు చేయూత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లకు ధన్యవాదాలు అని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar Goud) అన్నారు. మంగళవారం వెలువడిన యూపీఎస్సీ తుది ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు సత్తా చాటారు. దీనిపై మంత్రి పొన్నం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకమే (Rajiv Civils Abhyahastham Scheme) ఈ ఫలితాలకు ప్రోత్సాహం కల్పించిందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన.. సివిల్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించిన తెలంగాణ విద్యార్థులకు (Telangana Students) శుభాకాంక్షలు తెలిపారు. సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించి లక్ష్యాన్ని చేరుకున్న వారు భవిష్యత్తులో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల పక్షాన పని చేయాలని మంత్రి సూచించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి వారికి ప్రోత్సాహకాన్ని అందించిందని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) లకు ధన్యవాదాలు చెప్పారు. అంతేగాక సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారిని ప్రోత్సహించి వారికి ప్రభుత్వం అండగా నిలబడడం వల్లే తెలంగాణకి సివిల్స్ మంచి ఫలితాలు సాధించాయని అన్నారు. భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక సంఖ్యలో సివిల్స్ ర్యాంకులు సాధించాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు.






