గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా జేసీబీలపై రాళ్ల దాడి

by Gantepaka Srikanth |

హైదరాబాద్(Hyderabad) శివారులోని గాజురామారం(Gajularamaram)లో ఉద్రిక్తత నెలకొంది.

గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా జేసీబీలపై రాళ్ల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) శివారులోని గాజురామారం(Gajularamaram)లో ఉద్రిక్తత నెలకొంది. హబీబ్ బస్తీలో ఆక్రమణలను హైడ్రా(Hydraa) అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైడ్రా జేసీబీలపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీలపై రాళ్లు రువ్విన హబీబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గాజులరామారం ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పందించారు. గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రంగనాథ్‌ తెలిపారు. వందలాది ఎకరాలను ఆక్రమణదారులు కబ్జా చేశారన్నారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చడం లేదని.. ఖాళీగా ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు. గాజులరామారంలోని భూములు స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె వేస్తామని రంగనాథ్‌ తెలిపారు.

Next Story