భారత్‌లో పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 19 |
భారత్‌లో పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం లండన్‌లో భారత హై కమిషనర్ విక్రం కె. దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు కంపెనీల ప్రతినిధులు, ఇతరులకు తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాథమిక సమస్యలన్నింటి పైన దృష్టి సారించి, వాటి పరిష్కారానికి ప్రయత్నించామన్నారు. ఇన్నోవేషన్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన వంటి అంశాలపైన 9 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయ రంగం, ఐటీ నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమైందన్నారు.

తెలంగాణ సింగిల్ విండో అనుమతుల విధానంను తెరపైకి తెచ్చిందన్నారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ఈ విధానం ఇప్పటికే అనేక ప్రశంసలను అందుకుందని, ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ ఆధారిత కంపెనీల పెరుగుదల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్టైల్ వంటి రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్ ఈకో సిస్టం, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు వలన ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూకే విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో చేసుకున్న భాగస్వామ్యాల ఏర్పాటుకు ప్రస్తావించారు. ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ కే దురై స్వామి హెవీ మిషనరీ, ఏవియేషన్, డిఫెన్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో యూకే కంపెనీలతో భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒక అద్భుతమైన గమ్య స్ధానమని తెలిపారు. తెలంగాణ 9 ఏళ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతిని సాధించిందని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త కరెంట్ బిల్లీమోరియా ప్రస్తావించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి ఈ. విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed