Ts IPS Officers: రఘునందన్‌రావు‌పై ఆగ్రహం.. స్పీకర్‌కు ఫిర్యాదు

by Disha Web Desk 16 |
Ts IPS Officers: రఘునందన్‌రావు‌పై ఆగ్రహం.. స్పీకర్‌కు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. సరైన వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి ఆఫీసుకు వెళ్లారు. దీంతో అక్కడ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీపై రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే రఘునందన్ వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. డీజీపీపై రఘునందన్‌రావు వ్యాఖ్యలు ఆనాలోచితమని మండిపడ్డింది. పోలీసులు పట్ల ఇలాంటి వ్యాఖ్యలు అవమానకరమని ఆవేదన వ్యక్తం చేసింది. రఘునందన్‌రావు బాధత్యారహితమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

అయితే ప్రస్తుతం బండి సంజయ్ అరెస్ట్ తర్వాత థయన ఎక్కడున్నడో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. సరైన సమాచారం లేకపోవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. అటు పోలీసులు కూడా ఎక్కడా వివరణ ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే బండి సంజయ్ వరంగల్ పీటీసీలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలకుర్తిలో వైద్య పరీక్షలు నిర్వహించారని.. ఆ తర్వాత బండి సంజయ్‌ను పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరికాసేపట్లో హనుమకొండ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో హనుమకొండ కోర్టు పరసరాల ప్రాంతాలకు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ హంగామా పరిస్థితి కనిపిస్తోంది.

Read more:

DGP Office: పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు.. వెనక్కి తీసుకున్న రఘునందన్ రావు

Next Story

Most Viewed