- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజాప్రియదర్శిని కన్నుమూత
తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజాప్రియదర్శి(Justice Girija Priyadarshini)ని మృతిచెందారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజాప్రియదర్శి(Justice Girija Priyadarshini)ని మృతిచెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. 2022 మార్చిలో ఆమె తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతిపట్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, జస్టిస్ గిరిజాప్రియదర్శినిది ఏపీలోని విశాఖపట్టణ ప్రాంతం. ఈమె 1995లో లాయర్‌గా ఎన్‌రోల్ అయ్యారు. విశాఖ జిల్లా కోర్టులో ఏడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. 2008లో తొలిసారిగా అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం, విజయనగరం, నంద్యాల కోర్టుల్లో జడ్జిగా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు. తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు.. గిరిజా ప్రియదర్శిని.. రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగానూ పనిచేశారు.






