- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరగాళ్ల కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల గాలింపు
సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రంగంలోకి దిగింది.

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రంగంలోకి దిగింది. 2025 జనవరి 1 నుండి జూలై 31 వరకు రాష్ట్రంలోని 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలలో నమోదైన కేసులలో 228 మంది సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటి బ్యూరో డిజీ శిఖా గోయల్ వెల్లడించారు. గత ఏడు నెలల కాలంలో 228 మంది సైబర్ నేరగాళ్లు పట్టుబడగా.. వీరు దేశవ్యాప్తంగా 1,313 కేసులలో, రాష్ట్ర వ్యాప్తంగా 189 కేసులలో నిందితులుగా ఉన్నట్లు వెల్లించారు.
వీరు రూ.92 కోట్లు మోసం చేసినట్లు సైబర్ సెక్యూరిటి బ్యూరో పేర్కొంది. నిందితులలో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, బ్యాంకు ఉద్యోగులు, పలువురు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జనవరి నుంచి జూన్ వరకు సైబర్ క్రైమ్ ద్వారా రూ.726 కోట్లు బాధితులు నష్టపోయినట్లు సైబర్ బ్యూరో వెల్లడించింది. రూ.102 కోట్లు బాధితులకు రిఫండ్ చేశామని, రూ.105కోట్లు హోల్డ్‌లో ఉంచామని అధికారులు తెలియజేశారు.






