- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంకా సీఎంగా కేసీఆరే.. అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో మాజీ ముఖ్యమంత్రుల

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలను తొలగిస్తారు. అసెంబ్లీ ఎన్నికల క్రమంలోనే అనేక ప్రభుత్వ అఫిషియల్ వెబ్‌సైట్లలో, ప్రకటనల్లో మాజీ సీఎం ఫోటోలను తొలగిస్తారు. అయితే తెలంగాణ సీఎంఓ అఫీషియల్ వాట్సాప్ చానల్లో ఇంకా కేసీఆర్ ఫోటోలు మార్చలేదు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే చూపిస్తుంది. ఈ సీఎంఓ అఫీషియల్ వాట్సప్ చానల్ ప్రభుత్వ ఐటీ శాఖ నిర్వహణ చేస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఒక రోజు గడిచిన కూడా ఇంకా సీఎంఓగా రేవంత్ రెడ్డి పేరు మార్చకపోవడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Next Story






