కవిత ముందే కేసీఆర్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు

by Dishafeatures2 |
కవిత ముందే కేసీఆర్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ జాతీయ మీడియా నిర్వహించిన సదస్సులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందే సీఎం కేసీఆర్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో తెలంగాణలోని మద్యం అమ్మకాలు, కుటుంబ రాజకీయాలు, అప్పుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్నామలై విమర్శలు కురిపించారు.

మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఓటర్లను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఉపయోగిస్తున్నారని, ఇది అభివృద్దా? అంటూ అన్నామలై మండిపడ్డారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. తెలంగాణ నికర అప్పులు రూ.75 వేల కోట్లు అయితే.. ఇప్పుడు రూ.3.13 లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగిస్తుందని అన్నామలై విమర్శించారు.కుమారుడు మంత్రి, కుమార్తె ఎమ్మెల్సీ, బంధువు రాజ్యసభ ఎంపీగా ఉన్నారని, కుటుంబ రాజకీయాలకు మోడల్‌గా మారారని అన్నామలై దుయ్యబట్టారు. బీజేపీ సామాన్యుల పార్టీ అని, ఎవరైనా వచ్చి దేశానికి ప్రాతినిధ్యం వహించవచ్చని అన్నారు.



Next Story