మహిళలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్..!

by Disha Web Desk 14 |
మహిళలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మహలక్ష్మీ స్కీంలో భాగంగా మహిళలకు చార్జీలు లేకుండా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పండుగల సమయాల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ముందు ఆర్టీసీ ఓ ప్రతిపాదన చేసింది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మహిళలకు బస్సు చార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం తాజాగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా స్పష్టంచేశాయి. ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరస్కరించారని, మహిళల వద్ద ఎటువంటి చార్జీలు వసూలు చేయవద్దని చెప్పినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత ప్రయాణం విధానం అమలు చేయాల్సిందేనని ఆర్టీసీకి తేల్చి చెప్పినట్లు సమచారం. మరోవైపు మంత్రి సీతక్క కూడా స్పష్టంచేశారు. ఇటీవల ఆమె మేడారం జాతరను సందర్శించారు. మేడారం జాతరకు వచ్చే మహిళలకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కొనసాగుతుందని మీడియాతో చెప్పారు. కాగా, మేడారం జాతరకు ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులు నడపనుంది.

Next Story

Most Viewed