Bhu Bharati: భూ సమస్యలకు పరిష్కారం! భూ భార‌తి పోర్ట‌ల్‌కు స‌ర్వే మ్యాప్ లింక్ చేసేలా సాఫ్ట్ వేర్‌

by Ramesh Naini |   (  Updated:2025-09-01 13:48:59  IST  )

ప్ర‌జల‌కు మ‌రింత మెరుగైన, పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్స్, స‌ర్వే విభాగాల‌ను అనుసంధానం చేసేలా సాఫ్ట్ వేర్‌ను రూపొందిస్తున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Bhu Bharati: భూ సమస్యలకు పరిష్కారం! భూ భార‌తి పోర్ట‌ల్‌కు స‌ర్వే మ్యాప్ లింక్ చేసేలా సాఫ్ట్ వేర్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్ర‌జల‌కు మ‌రింత మెరుగైన, పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్స్, స‌ర్వే విభాగాల‌ను అనుసంధానం చేసేలా (Software) సాఫ్ట్ వేర్‌ను రూపొందిస్తున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. సోమవారం డాక్ట‌ర్ బీ.ఆర్‌.అంబేద్క‌ర్ రాష్ట్ర స‌చివాల‌యంలో రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్స్, స‌ర్వే విభాగం, ఎన్ఐసీ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. (Bhu Bharati portal) భూభార‌తి చ‌ట్టంలో రిజిస్ట్రేష‌న్ల‌కు స‌ర్వే మ్యాప్‌ను జతచేయాలని పేర్కొన్నందున భూభార‌తి పోర్ట‌ల్‌కు స‌ర్వే మ్యాప్ లింక్ చేసేలా సాఫ్ట్ వేర్‌ను అభివృద్ది పరుస్తున్నామని పేర్కొన్నారు. భూ భార‌తి పోర్ట‌ల్‌లో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు రాకుండా పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ మ‌రింత సుల‌భ‌త‌రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్ఐసీ అధికారుల‌కు ఆదేశించారు. కొత్త‌గా అభివృద్ది చేసే సాఫ్ట్‌వేర్‌లో కోర్టు కేసుల మానిట‌రింగ్ సిస్ట‌మ్ ఉండేలా చూడాల‌ని సూచించారు. న‌క్షా లేని ఐదు గ్రామాల‌లో రీస‌ర్వే కొలిక్కివ‌చ్చిన నేప‌ధ్యంలో మిగిలిన 408 గ్రామాల్లో త్వరలోనే రీసర్వేను ప్రారంభిస్తామని వెల్లడించారు. భ‌విష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భూవివాదాల ప‌రిష్కారానికి ఈ స‌ర్వే మార్గద‌ర్శకం కానుందని వెల్లడించారు.

Next Story