క్రికెట్ ఆడుతుండగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గుండెపోటు

by Disha Web Desk 2 |
క్రికెట్ ఆడుతుండగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గుండెపోటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల గుండె పోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పెద్దల నుంచి చిన్న పల్లల వరకు గుండెపోటుతో చనిపోతున్నారు. డ్యాన్స్ చేస్తూ ఒకరు, డ్రైవింగ్ చేస్తూ మరొకరు, షటిల్ అడుతూ ఇంకొకరు, టీవీ చూస్తూ, నిద్ర పోతూ, షటిల్ ఆడుతూ, వ్యాయామం చేస్తూ ఇలా చాలా మంది హఠాన్మరణం చెందుతున్నారు. సమయం సందర్భం లేకుండా పెద్దగా ఆరోగ్య కారణాలు కూడా లేకుండా మృత్యువాత పడుతున్నారు.

తాజాగా, ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఘట్టుపల్లిలోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరానికి చెందిన మణికంఠ హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. శనివారం వారాంతం కావడంతో క్రికెట్ ఆడేందుకు ఘట్టుపల్లి కేసీఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆయనకు వెన్ను నొప్పి వచ్చింది. దాంతో ఆయన మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయారు.

అనంతరం స్టేడియం బయట తన కారులో పడుకున్నారు. మ్యాచ్ అయిన తర్వాత స్నేహితులు వెళ్లే సరికి మణికంఠను నిద్ర లేపేందుక ప్రయత్నించారు. అయితే ఆయన ఎంతకీ పలకకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మణికంఠ చనిపోయాడని వైద్యులు తెలిపారు. మణికంట సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. మణికంఠ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story