Gutta : కేసీఆర్ వల్లె ఎస్ఎల్బీసీకి ఈ దుస్థితి : గుత్తా

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-28 12:32:31  IST  )

కేసీఆర్ ప్రభుత్వం(KCR Government)కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మీద పెట్టిన శ్రద్ధలో 20 శాతం పెట్టినా.. ఎస్ఎల్బీసీ(SLBC Tunnel) పూర్తయ్యేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutta Sukhender Reddy) విమర్శించారు.

Gutta : కేసీఆర్ వల్లె ఎస్ఎల్బీసీకి ఈ దుస్థితి : గుత్తా
X

దిశ, వెబ్ డెస్క్ : కేసీఆర్ ప్రభుత్వం(KCR Government)కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మీద పెట్టిన శ్రద్ధలో 20 శాతం పెట్టినా.. ఎస్ఎల్బీసీ(SLBC Tunnel) పూర్తయ్యేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutta Sukhender Reddy) విమర్శించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కాళేశ్వరంకి ఇచ్చిన అడ్వాన్స్ లు ఎస్ఎల్బీసీకి ఇస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని గుత్తా మండిపడ్డారు. టన్నెల్ ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలని.. రాజకీయం చేయొద్దన్నారు. ఇంతకు ముందు శ్రీశైలం పవర్ హౌజ్ లో ప్రమాదం జరగలేదా?, కాళేశ్వరంలో పంప్ హౌస్ లు మునిగి జనాలు చనిపోలేదా? అని ప్రశ్నించారు.

ఎస్ఎల్బీసీ ఎందుకు ఆలస్యం ఎందుకు అయ్యిందనేది మాజీమంత్రి హరీష్ రావుకి తెలియంది కాదని..ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదన్నారు. ప్రమాదం జరిగిన రెండు గంటలలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడని.. నేతలు ఎంత మంది అక్కడికి పోతే.. సహాయక చర్యలకు అంత అవరోధమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హరీష్ రావు విమర్శలు ఆర్థరహితమని.. విమర్శలు చేసుకునే సమయమా? ఇది అని .. ఆర్మీ పర్యవేక్షణ లో టన్నెల్ లో చిక్కుకున్న వారి కోసం సహాయక పనులు జరుతున్నాయని గుర్తు చేశారు. టెక్నికల్ పర్సన్స్ మాట్లాడితే బాగుంటుందన్నారు.

టన్నెల్ పనులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు పోవాల్సిందేనన్నారు. ప్రమాదం జరగడం సహజమేనని...ప్రమాదం పేరు చెప్పి ప్రాజెక్టులు పక్కన పెట్టబోరన్నారు. ప్రమాదకరం కనుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని వదిలేసిందని..నిన్ననే హరీష్ రావు అన్నారని..అదే సమయంలో వారి హాయంలో మూడు వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకున్నాడని గుర్తుచేశారు. ప్రాజెక్టు అనువైనది కాదన్నప్పుడు ఎందుకు మూడు వేల కోట్లు ఖర్చు చేశారని గుత్తా నిలదీశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారాసాగునీరు..ఫ్లోరైడ్ పీడిత 600గ్రామాలతో పాటు హైదరాబాద్ కు తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ఎస్ఎల్బీసీని చేపట్టడం జరిగిందని గుత్తా తెలిపారు. టన్నెల్ కి అభయారణ్యం నేపథ్యంలో అటవీశాఖ చాలా షరతులు పెట్టిందని.. సౌండ్ రాకుండా డ్రిల్ చేయాలని నిబంధన పెట్టారని..ఆ నిబంధనల మేరకు ఇప్పటిదాకా పనులు జరిగాయన్నారు. 43.4కిలోమీటర్ల టన్నెల్ కాకుండా..సొరంగం ఎండ్ పాయింట్ తర్వాత వచ్చే నక్కలగండి(7.4టీఎంసీ)రిజర్వాయర్ పూర్తయ్యిందని..దీనికి గేట్లు పెట్టే పనులు మిగిలాయన్నారు. ఇక్కడి నుంచి 14కిలోమీటర్లు ఓపెన్ చానల్ ఉంటుందని.. ఆ తర్వాతా వచ్చే రెండో సొరంగం 7కిలోమీటర్లు పనులు పూర్తి చేసి 50శాతం లైనింగ్ పూర్తయ్యిందన్నారు.

ఓపెన్ కెనాల్ తర్వాతా పెండ్లీ పాకల 2.2టీఎంసీ రిజర్వాయర్ ఉంటుందని..దీని కాంట్రాక్టర్ వెనక్కి పోవడంతో 1200కోట్లతో మరోసారి టెండర్ లు సిద్దంగా ఉన్నాయన్నారు. పెండ్లి పాకల రిజర్వాయర్ నుంచి 15 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారని.. ఆక్కంపల్లి నుంచి ఇప్పటికే ఉన్న ఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా నీటిని పానగల్ ఉదయం సముద్రం వరకు తరలిస్తారని... ఇక్కడి నుంచి ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని పంపింగ్ చేయనున్నట్లుగా తెలిపారు.

ప్రధాన సొరంగం 43.4కిలోమీటర్లలో శ్రీశెలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకునే ఇన్ లెట్ సొరంగం19.50 కిలోమీటర్లకు ఇప్పటివరకు 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్ల దూరం తవ్వాల్సి ఉందని.. శ్రీశైలం నిండిన ప్రతిసారి కూడా నెలలపాటు పనులు నిలిచిపోతున్నాయన్నారు. సొరంగ మార్గంలోకి భారీగా నీటి ఊట రావడంతో పాటు మట్టి పెల్లలు కూలుతుండడంతో పనులకు ఆటంకం జరుగుతూ ఉందన్నారు. ప్రస్తుతం ఇన్ లెట్ సొరంగం పనుల్లోనే ప్రమాదం జరిగిందన్నారు.

ఇక మన్నెవారిపలి వైపు నుంచి కొనసాగుతున్న అవుట్‌లెట్ పనులు 20.435 కిలోమీటర్లు పూర్తవ్వగా ఇంకా 3.545 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందని..దీని మొత్తం పొడవు 23.980 కిలోమీటర్లని..మొత్తంగా ఈ ప్రధాన సొరంగంలో ఇంకా మొత్తం 9.56 కిలోమీటర్లు సొరంగాన్ని తవ్వాల్సి ఉందన్నారు. తరుచు సీపేజ్ వాటర్ తో కాంట్రాక్టు సంస్థ సొరంగం పనుల నిర్వహణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతునే ఉందన్నారు.

2014తర్వాతా ఆనాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ కమిటీ హాల్ లో జానారెడ్డి సారధ్యంలో అఖిల పక్ష సమావేశం పెట్టారన్నారు. ఎస్ఎల్బీసీ టీబీఎంపై చర్చించి చివరకు ప్రస్తుత పద్ధతిలోనే కొనసాగించాలని నిర్ణయించి కాంట్రాక్టర్ కు రూ.100కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు.. టన్నెల్ పరిస్థితిపై గతంలో తాను కేసీఆర్ కు నివేదికలు ఇచ్చానన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ఎల్బీసీని వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ఇందులో భాగంగా 4,687కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 8నెలల క్రితం అవుట్ లెట్ సొరంగంలో పది కిలోల మేరకు ప్రయాణించి పనులు చూశామన్నారు. పనులు ఆగిపోయిన అవుట్ లెట్ టీబీఎం బేరింగ్ మద్రాసు పోర్టుకు చేరుకుందని..ఇక ఈ నెల 18నుంచి పనులు తిరిగి ప్రారంభమైన ఇన్ లెట్ సొరంగంలో ప్రమాదం జరిగిందన్నారు. 18మీటర్లు త్రవ్వకం జరిగిందన్నారు.

ఏది ఏమైనా 'పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలన్నారు. ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి, డిండి, ప్రాణహిత చేవెళ్ల వంటి ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలన్నారు. గంధమల్ల ప్రాజెక్టును 9టీఎంసీల నుంచి 1.5టీఎంసీకి తగ్గించారన్నారు. దీని టెండర్ పిలిచి అగ్రిమెంట్ జరిగి ఆరెళ్లయినా ఎకరం కూడా భూసేకరణ చేయలేదన్నారు.


Next Story