తెలంగాణపై శివసేన ఫోకస్.. అనూహ్యంగా అధ్యక్షుడి నియామకం

by Disha Web Desk 2 |
తెలంగాణపై శివసేన ఫోకస్.. అనూహ్యంగా అధ్యక్షుడి నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగిన సింకారు శివాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరి, శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన అధికార నివాసంలో శివాజీకి నియామకపత్రం అందజేశారు. ఉన్నట్టుండి శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను భర్తీ చెయ్యడం, అది కూడా కింది స్థాయి నుంచి వచ్చిన యువ నాయకుడికి పట్టం కట్టడం పట్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సింకారు శివాజీ గతంలో ఏబీవీపీ లాంటి విద్యార్థి సంస్థలో పని చెయ్యడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిగా కూడా పేరుంది.

విద్యార్థి నిరుద్యోగ సమస్యల పైన పోరాటం చెయ్యడం, హిందూ సమాజం ఐక్యత కోసం అందరితో కలిసి పని చెయ్యడం. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ఎక్కడ సమస్యలు ఉంటె అక్కడ వాలిపోయే విద్యార్థి నాయకుడిగా పేరు సంపాదించిన సింకారు శివాజీకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను అప్పగిస్తే పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ గ్రహించిందని తెలుస్తుంది. శివ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతను సింకారు శివాజీకి అప్పజేప్పడం వెనక ఏక్‌నాథ్‌ షిండేది బలమైన ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే వరుస మహారాష్ట్ర పర్యాటనలు చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతను స్వయంగా తన బంగ్లా (వర్ష సీఎం నివాసంలో) ఆయననే పిలిచి అందించి రాష్ట్ర రాజకీయాల పైన పూర్తి వివరాలను అడిగి తీసుకున్నట్లు తెలుస్తుంది. సింకారు శివాజీ శివ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఏవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మలుపు తిరుగుతందో అర్ధం కానీ విషయం.



Next Story

Most Viewed